నేను బతికున్నంత వరకు... దర్శన్ నా కొడుకు లాంటివాడే: సుమలత

  • అభిమాని హత్య కేసులో జైలుపాలైన కన్నడ హీరో దర్శన్
  • ఇటీవల అనారోగ్య కారణాలతో బెయిల్ పై విడుదల
  • అంబరీష్-సుమలత కుటుంబంతో దర్శన్ కు మంచి అనుబంధం
  • దర్శన్ నిర్దోషిగా విడుదలవుతాడన్న సుమలత
నటి పవిత్రగౌడతో సహజీవనం, అభిమాని రేణుకాస్వామి హత్య.. తదితర అంశాలతో కన్నడ హీరో దర్శన్ జాతీయస్థాయిలో చర్చనీయాంశం అయ్యాడు. జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న దర్శన్ కు ఇటీవలే కోర్టు ఆరోగ్య కారణాల రీత్యా బెయిల్ మంజూరు చేసింది. 

కాగా, దర్శన్ కు అంబరీష్-సుమలత దంపతులతో మంచి అనుబంధం ఉంది. అంబరీష్ మరణించినప్పటికీ, ఆయన కుటుంబానికి దర్శన్ సన్నిహితుడిగా కొనసాగుతున్నాడు. తాజాగా, సుమలత ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

నేను బతికున్నంత కాలం వాడు నా కొడుకు లాంటి వాడే అంటూ దర్శన్ ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. గతంలో తమకు దర్శన్ తో ఎలాంటి అనుబంధం ఉందో, ఇప్పటికీ అదే అనుబంధం కొనసాగుతోందని తెలిపారు. దర్శన్ భార్య ప్రతి రోజు తనతో మాట్లాడుతూనే ఉంటుందని సుమలత వెల్లడించారు. 

దర్శన్ కు ప్రస్తుతం ఆరోగ్యం బాగాలేదని, మొదట వాడు ఆరోగ్యవంతుడు కావాలని ఆకాంక్షించారు. వాడి ముందు అనేక సవాళ్లు ఉన్నాయి... తనపై పడ్డ నిందల నుంచి నిర్దోషిగా బయటపడతాడనే నమ్మకం ఉంది... అని సుమలత పేర్కొన్నారు.

Sumalatha
Darshan
Karnataka

More Telugu News